ANJALI C. B. I MOVIE TELUGU REVIEW
అంజలిసిబిఐ:పర్వాలేదు అనిపించినా యాక్షన్ థ్రిల్లర్
విడుదల తేదీ ఫిబ్రవరి 22 2019
రేటింగ్ :2.5/5
నటీనటులు : నయనతార, రాశిఖన్నా, అనురాగ్ కశ్యప్, అథర్వా , విజయ్ సేతుపతి
దర్శకత్వం : అజయ్ జ్ఙానముత్తు
నిర్మాతలు : రాంబాబు, గోపినాథ్ అచంట
సంగీతం : హిప్ హప్ తమిళ
సినిమాటోగ్రఫర్ : ఆర్ డి రాజశేఖర్
ఎడిటర్ : రామకృష్ణ
కథ :
సైకో కిల్లర్ రుద్ర (అనురాగ్ కశ్యప్ )వరుస హత్యలు చేస్తూ సి బి ఐ కి సవాలుగా మారుతాడు. ఈ కేసును సి బి ఐ ఆఫీసర్ అంజలి (నయనతార ) హ్యాండిల్ చేస్తుంది. ఈ క్రమంలో రుద్ర, సి బి ఐ కి చెప్పి మరి హత్యలు చేస్తుంటాడు. ఇంతకీ ఈ రుద్ర ఎవరు? అతను సైకో కిల్లర్ గా మారడానికి అంజలి ఎలా కారణం అవుతుంది? చివరికి అంజలి సి బి ఐ , రుద్ర ను పట్టుకుందా లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అంటే లీడ్ రోల్స్. అందులో మొదటిది సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించిన నయన తార రోల్. తనకు లభించిన ప్రతి పాత్రను రక్తికట్టించే నయన్ ఈ సినిమా లో కూడా అలాగే చేసింది. దాంతో ఆమె పాత్ర చాలా బాగా ఎస్టాబిలేష్ అయ్యింది.
ఇక ఈసినిమా లో విలన్ రోల్ మరో హైలెట్. ఈ పాత్రలో నటించిన బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ చాలా ఈజీ గా చేశాడు. ముఖ్యంగా ఆయన కళ్లతో పలికించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. అయన కు డబ్బింగ్ కూడా చాలా బాగా కుదిరింది.
వీరి తరువాత సినిమాలో మరో మేజర్ రోల్ అంజలి తమ్ముడి అర్జున్ ది. ఈపాత్రకు యంగ్ హీరో అథర్వా కరెక్ట్ గా సరిపోయాడు.అయన నటన కూడా బాగుంది. ఇక అర్జున్ లవర్ గా నటించిన రాశి ఖన్నా చాలా గ్లామర్ గా కనిపించింది అలాగే ఒక ముఖ్య పాత్రలో నటించిన విజయ్ సేతుపతి వున్నది కాసేపయినా మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చాడు.
మైనస్ పాయింట్స్ :
థ్రిల్లర్ స్టోరీ కి టైట్ స్క్రిప్ట్ చాలా అవసరం కానీ ఈసినిమాలో అది మిస్ అయ్యింది. దాంతో సినిమా అక్కడక్కడా బోరింగ్ అనిపిస్తుంది. ఇక సినిమా కిమరో మైనస్ రన్ టైం. దాదాపు మూడు గంటల పాటు వున్నా ఈ సినిమా రన్ టైం ఒక దశ దాటాక సినిమా ఫై ఆసక్తిని పోగొట్టింది. సినిమా ని ఎండ్ చేయడానికి మంచి అవకాశం వచ్చిన దర్శకుడు కావాలని సినిమా ని పొడిగించనట్లుగా అనిపిస్తుంది.
ఇక కేవలం ఒక్కడే మొత్తం సి బి ఐ డిపార్ట్మెంట్ ను ముప్పతిప్పలు పెట్టడం లాజిక్ లేకుండా సాగుతుంది. అలాగే అంజలి కూతురు పాత్ర కూడా అతిగా అనిపిస్తుంది. అథర్వా -రాశి ల రొమాంటిక్ ట్రాక్ సినిమాకి అవసరం లేదని అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
కెప్టెన్ అఫ్ ది షిప్ డైరెక్ట్ అజయ్ జ్ఙాన ముత్తు సినిమా తెరకెక్కించిన విధానం బాగుంది. టైట్ స్క్రీన్ ప్లే తో సినిమా ను ఇంటెన్సివ్ గా తీర్చిదిద్దాడు. సినిమాలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి కానీ స్క్రిప్ట్ లో ఇంకా డెప్త్ ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదే.
ఇక సినిమా కి మరో ప్లస్ సినిమాటోగ్రఫీ. ఆర్ డి రాజశేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ లుక్ తీసుకొచ్చి సినిమా ఫై ఆసక్తిని తీసుకొచ్చింది. హిప్ హప్ తమిళ అందించిన సంగీతం యావరేజ్ గా వుంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇక ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు కూడా రిచ్ గా వున్నాయి.
తీర్పు :
అజయ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నయన్,అనురాగ్ కశ్యప్, అథర్వా ల నటన, కొన్ని గ్రిప్పింగ్ సన్నివేశాలు హైలట్ అవ్వగా లాజిక్ లేని సన్నివేశాలు,రొమాంటిక్ ట్రాక్, రన్ టైం మైనస్ అయ్యాయి. చివరగా ఈచిత్రం థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది కానీ మిగతా వారికీ పెద్దగా కనెక్ట్ అవ్వకపోవొచ్చు.
రేటింగ్ : 2.5/5
Comments
Post a Comment