118 movie telugu review

118 : సస్పెన్స్ థ్రిల్లర్ 

విడుదల తేదీ : మర్చి 1 2019
రేటింగ్ : 3.25/5
నటీనటులు : కళ్యాణ్ రామ్ , నివేదా థామస్ , షాలిని పాండే
దర్శకత్వం : కే వి గుహన్
నిర్మాత : మహేష్ ఎస్ కోనేరు
సంగీతం : శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫర్ : కే వి గుహన్
ఎడిటర్ : తమ్మిరాజు

కథ :
గౌతమ్ (కళ్యాణ్ రామ్) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. తనకు ఆద్యా ( నివేత థామస్ ) గురించి కల వస్తుంది. ఆ కల కు గౌతమ్ నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటలకు కనెక్షన్ ఉంటుంది. దాంతో నిజంగా ఆమె వుందా లేదా, అసలు ఆమె ఎవరు అని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేటివ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో గౌతమ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు. ఇంతకీ ఆద్యా ఎవరు ? ఆమె ఏం చేసేది? చివరికి ఆద్యా ను గౌతమ్ కలిశాడా లేదా ? అసలు 118 కి ఆద్యా కు వున్న సంబంధం ఏంటి అనేదే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ అంటే కాన్సెప్ట్ అనిచెప్పాలి. ఇక ఆ కాన్సెప్టు ని తెర మీదకు తీసుకురావడంలో గుహన్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అలాగే సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ ఫై ఇంట్రస్ట్ ను తీసుకొస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కళ్యాణ్ రామ్. గౌతమ్ పాత్రలో చాలా బాగా నటించాడు. కొత్త మేక్ ఓవర్ తో కళ్యాణ్ రామ్ సినిమాలో ఎనర్జిటిక్ గా కనిపించాడు. అలాగే ఆధ్యా పాత్రలో నటించిన హీరోయిన్ నివేదా థామస్ తన నటన తో మెప్పించింది. కథ అంతా ఆమె చుట్టూ తిరిగేది కావడంతో సినిమాలో ఆమె కు మంచి పాత్ర దొరికింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన బాగుంది.
కళ్యాణ్ రామ్ కు సపోర్టింగ్ పాత్రల్లో నటించిన షాలిని పాండే , కమెడియన్ ప్రభాస్ శ్రీను వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయ్యింది.అలాగే విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి.
మైనస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ స్టోరీనే. కాన్సెప్ట్ బాగున్నా దానికి తగ్గ కథను రెడీ చేసుకోలేకపోయాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించినా సెకండ్ హాఫ్ లో ఆ ఫీల్ మిస్ అవుతుంది. దానికి కారణం నివేదా థామస్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ చాలా రొటీన్ గా అనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ చాలా వరకు ఊహాజనితంగా సాగడం కూడా సినిమాకు మైనస్ ఆయ్యింది.
ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ కి స్క్రిప్ట్ లో డెప్త్ ఉంటే సినిమా మరో స్థాయిలో ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో అది మిస్ అయినా ఫీల్ కలుగుతుంది. ఇక దానికి తోడు సినిమా అంతా సీరియస్ గా సాగడం కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు రుచించకపోవచ్చు.
సాంకేతిక విభాగం :
మంచి కాన్సెప్ట్ ను సెలక్ట్ చేసుకున్న డైరెక్టర్ కే వి గుహన్ దానికి తగ్గట్లు గా కథను సిద్ధం చేసుకోలేకపోయాడు. కానీ సినిమా ను ఇంట్రస్టింగ్ గా చూపించడం లో చాలా వరకు విజయం సాధించారు. ఇక మిగతా టెక్నీషియన్స్ విషయానికి వస్తే శేఖర్ చంద్ర సంగీతం తో పర్వాలేదనిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం ఆకట్టుకున్నాడు. ఆయన నేపథ్య సంగీతం చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది.
అలాగే ఈసినిమాకు డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రఫర్ అయినా గుహన్ కెమెరామెన్ గా కూడా మెప్పించాడు. సినిమాలోని ప్రతి ఫ్రెమ్ చాలా రిచ్ గా కనిపిస్తుంది. తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. మహేష్ కోనేరు నిర్మాణ విలువలు చాలా రిచ్ గా వున్నాయి.
తీర్పు :
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో గుహన్ తెరకెక్కించిన ఈ 118లో కాన్సెప్ట్ , కళ్యాణ్ రామ్ , నివేదా థామస్ ల నటన హైలైట్ అవ్వగా సెకండ్ హాఫ్ లో వచ్చే నివేదా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మైనస్ గా చెప్పొచ్చు. చివరగా ఈ చిత్రం ఏ సెంటర్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అయితే బి & సి సెంటర్ల ప్రేక్షకులు ఈసినిమా ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

రేటింగ్ : 3.25/5

Comments

Post a Comment

Popular Posts